కేంద్ర ఎన్నికల సంఘానికి కనకమేడల మరో లేఖ

Apr 20,2024 17:41

ఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘానికి తెదేపా సీనియర్‌ నేత కనకమేడల రవీంద్ర మరో లేఖ రాశారు. సీఎంపై రాయి దాడి కేసులో బండా ఉమాను ఇరికించేందుకు ప్రయత్నినిస్తున్నారని అందులో పేర్కొన్నారు. విజయవాడ పోలీసుల తీరును ఆయన ఖండించారు. బండా ఉమా పోటీ చేయకుండా అడ్డుకునేందుకు వారు ప్రయత్నిస్తున్నారన్నారు. సీఎంపై రాయి దాడి ఘటన తర్వాత ఇప్పటివరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఈసీ వెంటనే జోక్యం చేసుకోవాలని కనకమేడల లేఖలో విజ్ఞప్తి చేశారు. ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు చెరగని ముద్ర వేశారని కనకమేడల రవీంద్ర అన్నారు. అభివృద్ధి, సంక్షేమం, సంపద సృష్టికి ఆయన ఒక బ్రాండ్‌ అని కితాబిచ్చారు. చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా దిల్లీలో కనకమేడల కేక్‌ కోసి వేడుకలు చేశారు. జగన్‌ విధ్వంసకర ఆలోచనలతో అమరావతిని తిరోగమనం చేశారని మండిపడ్డారు. వైకాపా పాలనలో ఏపీ అల్లకల్లోలమైందని విమర్శించారు.

➡️