ఇటుకల పండుగ

Apr 17,2024 00:01
చందాలు వసూలు చేస్తున్న మహిళలు

ప్రజాశక్తి -అనంతగిరి:గిరిజన ప్రాంతంలో సాంప్ర దాయం ప్రకారం ఇటుకల పండుగను గిరిజనులు నిర్వహించారు. గిరిజన ప్రాంతంలో గిరిజనులు నెల రోజులపాటు ఆచారం ప్రకారం పండగను నిర్వహించుకుంటారు. గిరిజనులు వారం రోజుల ముందు నుండి ఇంట్లో కావలసిన సామాగ్రితో పాటు రంగురంగులగా ముగ్గులతో అలంకరిస్తారు. కుటుంబ సభ్యులు అంతా కొత్త దుస్తులను ధరించి ఈ పండుగను భక్తి పూజలతో ఘనంగా నిర్వహించుకుంటారు. ఈ సందర్భంగా మహిళలు అరకు, అనంతగిరి ప్రధాన రహదారి గుండా టోల్‌ గేట్లను ఏర్పాటు చేసి వాహనదారులు, ప్రయాణికుల నుండి చందాలు వసూలు చేశారు. పురుషులు సాంప్రదాయ ఆయుధాలతో అడవిలో వేటకు వెళతారు. ఈ రకంగా పండుగను వారం నుండి పది రోజుల వరకూ థింసా నృత్యాలతో గ్రామాల్లో వచ్చి పోయే వారికి రంగు నీళ్లు జల్లుతూ ఘనంగా నిర్వహించుకుంటారు. మహిళలు వసూలు చేసిన పజోరు (చంద) డబ్బులతో చివరి రోజు భోజనాలు ఏర్పాటు చేసుకుని గ్రామస్తులంతా భుజించుకుంటారు. పండుగ నెలరోజుల పాటు గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంటుంద.

➡️