సిగ్గు పడుతున్నాను

Feb 19,2024 10:43

భావపరంపర సెలయేరులో

సాయంత్రం ఒక టీకప్పును ఇద్దరు మిత్రులు పంచుకున్నారు

సిరివెన్నెల రసవాహినిలో

రాత్రిపూట ఒక పూలపాన్పును

ఇద్దరు ప్రేమికులు పంచుకున్నారు

కరువు తాండవంతో

ఆకలి గాయాల్ని మాన్పుకోవడానికి

ఒక రొట్టెముక్కనుఇద్దరు బిచ్చగాళ్లు పంచుకున్నారు

 

ఇది స్నేహితుల ధరణిగా గొప్పగా అనుకున్నాను

ఇది ప్రేమికుల ధరిత్రిగా

ఉన్నతంగా ఊహించుకున్నాను

కానీ, పస్తులే ఆస్తులైన అవనిగా

సిగ్గుపడుతున్నాను

– కోటం చంద్రశేఖర్‌ 94920 43348

➡️