ఇట్టయితే ఎట్టుంటాది..!!

ఇట్టయితే ఎట్టుంటాది..!!

ఇట్టయితే ఎట్టుంటాది..!!ప్రజాశక్తి -శ్రీకాళహస్తి: మావా.. రా మావా.. నీ కోసమే ఎదురు సూస్తా ఉండాను. ఎలచ్చన్లో నువ్వు జెప్పింది నేను ఇన్నా.. ఈ యాళ నేను జెప్పింది నువ్వు ఇనాల అంతే. యాం లేదు మావా.. జగనన్న సీఎం అయ్యి, కాళాస్త్రిలో మధుసూదన్‌ రెడ్డి ఎమ్మెల్యే అయితే ఓకే.. అట్టగాకుండా సెంద్రబాబు సీఎం అయ్యి, సుధీర్‌ రెడ్డి ఎమ్మెల్యే అయితే ఓకే.. అదీగాకుండా ఏరే ఇదంగా అయితే…? అదే మావా జగనన్న సీఎం అయ్యి ఇక్కడ సుధీర్‌ రెడ్డి ఎమ్మెల్యే అయితే, ఇంకాగాకుండా అక్కడ సెంద్రబాబు సీఎం అయ్యి ఇక్కడ మధుసూదన్‌ రెడ్డి ఎమ్మెల్యే అయితే ఎట్టుంటాది అనేది నా బుర్రలో ఆలోశన. ఎండకి తిరిగితే బుర్ర గిర్రని తిరగతా ఉండ్ల. ఆ మాదిర్తో రాతిరి నుంచి ఇదే తిరగతా ఉండాది. సీకటితోనే ఇంటి కాడికి ఒచ్చినా. మీ మావ వాకింగ్‌కి పొయ్యినాడని మాయత్త జెప్పింది. సరే యాడికి బొయ్యినా సద్దికూడు తాగేసి ఒస్తావని సావిట్లో కూసోనుండా. నేను జెప్పింది అయ్యేదానికి శాన్సు ఉండాదా.. లేదా.. కరెట్టా.. కాదా.. సెప్పు మావా. ఉండాదంటావు, లేదంటావు, జరగతాదంటావు, జరగదంటావు యాంది మావా. వాకింగ్‌కి పోతే పిచ్చికుక్కేమన్నా కరిసిందా… లేకపోతే ఎండకి తలకాయ తిరగతా ఉండాదా.. మాయత్త యామన్న అనిందా. అవును నిజమే మావా.. నువ్వు జెప్పింది గూడ ఆలోసించాల. చేసినోడిని ఒదిలేసి… చూసినోడిని ఒదిలేసి… చెప్పినోడిని ఒదిలేసి.. ఊ కొట్టినోడిని ఒదిలేసి.. ఈ మెసేజి సదివినోళ్ళ పైన కచ్చ పెంచుకుంటారు. మనోళ్లు సెప్పుడు మాట్లు బాగ ఇంటారు. రిజల్సు ఎట్టుండినా నేను జెప్పింది కరెట్‌ అని జెప్పినావు నాకు శానా ఇదిగా ఉండాది మావా ఇట్టయితే ఎట్టుంటాది.. ఇట్టయితే ఎట్టుంటాది..!!

➡️