ఆనందబాబు సమక్షంలో టిడిపిలో చేరిక

Mar 31,2024 23:48 ##tdp #Battiprolu #Anandababu

ప్రజాశక్తి – భట్టిప్రోలు
మండలంలోని గొరిగపూడి సర్పంచ్ గరికపాటి మల్లిక, మాజీ ఎంపీటీసీ గరికపాటి వెంకటేశ్వరరావుతో పాటు మరో 20వైసీపీ కుటుంబాలు టిడిపి అభ్యర్థి, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు సమక్షంలో ఆదివారం టిడిపిలో చేరారు. వారికి టిడిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. పార్టీ ఏర్పడిన వాటి నుండి వైసీపీలో పనిచేసి గత ఎన్నికల్లో మెరుగు నాగార్జున గెలుపుకు ఎంతో కృషి చేశానని, మండలంలో ఎక్కడా లేనివిధంగా గొరిగిపూడిలో వైసిపికి భారీ మెజార్టీని తెప్పించినట్లు మాజీ ఎంపిటిసి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. అలాంటి తనను నాగార్జున విస్మరించడమే కాక తన ద్వారా చేపట్టిన వివిధ రకాల పనులతో రూ.లక్షలు నష్టపోయానని వాపోయారు. అంతేకాక వైసిపి పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. దీంతోపాటు నాగార్జున వ్యవహార శైలితో తాను ఏనాడో వైసీపీని వీడి టిడిపిలో చేరాలని భావించగా ఇన్చార్జి బాధ్యతలు చేపట్టిన అశోక్ బాబు తనను వైసిపిలోనే పనిచేసేందుకు బుజ్జగించినప్పటికీ అక్కడ కూడా ఇమడలేక టిడిపిలో పనిచేయాలని నిశ్చయించుకున్నట్లు తెలిపారు.

➡️