కలసి పనిచేద్దాం : కారంచేడు కార్యకర్తలతో యడం బాలాజీ

Mar 31,2024 23:47 ##ysrcp #Parchuru

ప్రజాశక్తి – కారంచేడు
నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కలిసి విభేదాలు లేకుండా పనిచేస్తే రానున్న ఎన్నికల్లో వైసిపి గెలుస్తుందని వైసిపి పర్చూరు నియోజకవర్గ ఎంఎల్‌ఎ అభ్యర్థి యడం బాలాజీ పేర్కొన్నారు. చీరాలలోని తన కార్యాలయంలో కారంచేడు వైసిపి నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్ళు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను సైతం నెరవేర్చి ప్రజలకు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అందించారని అన్నారు. సంక్షేమ పధకాలతోనే అభ్యర్ధులు ఎన్నికల బరిలోకి దిగాల్సి ఉందని అన్నారు. ఐదేళ్ల కాలంలో రాష్ట్ర ప్రజలకు, అందించిన అనేక రకాల సంక్షేమ పధకాలు, గ్రామాల్లో జరిగిన అభివృద్ది పనులు ప్రజల హృదయాల్లో నిలిచిపోయాయని అన్నారు. కార్యక్రమంలో కారంచేడు వైస్ ఎంపీపీ యార్లగడ్డ సుబ్బారావు, పర్చూరు ఎఎంసీ మాజీ చైర్మన్ జువ్వా శివరామప్రసాద్, ఉప్పలపాటి ఆనీల్, మాజీ వైస్ ఎంపీపీ యార్లగడ్డ వెంకటేశ్వరరావు, వైసీపీ నాయకులు కొడాలి ధర్మానంధరావు, గోగినేని బుల్లెబ్బాయి, దేవిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, భవనం వెంకటేశ్వరెడ్డి, గోగినేని సతీష్ కుమార్, భవనం శ్రీరామరెడ్డి, కొణిదెల రాజకుమారి, చిన్న, మాదాసు కుమారి, తోటకూర శ్రీనివాసరావు, బోడావుల హరిబాబు, సుబ్రమణ్యం, సీహెచ్ సుబ్బయ్య, టీ చింపిరమ్మ, నూర్బాషా, మీరయ్య, గుదిబండి నాగిరెడ్డి, ఎం నాగేశ్వరావు, కుంభా సుజాత, నాయకులు పాల్గొన్నారు.

➡️