గొనసపూడిలో నాయకుల సందడి

Dec 31,2023 02:19

ప్రజాశక్తి – ఇంకొల్లు
నూతన సంవత్సరం ప్రారంభానికి రెండు రోజులు ముందే గొసపూడి గ్రామంలో రాజకీయ నాయకులు సందడి చేశారు. గ్రామానికి చెందిన యువ పారిశ్రామికవేత్త విక్రమ్ నారాయణారావు, సర్పంచ్ విక్రమ్ నారాయణదీప్తి, విక్రమ్ అజయ్ దంపతుల నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పులువురు రాజకీయ నాయకులు సందడి కలిగించారు. మాజీ మంత్రి డాక్టర్‌ దగ్గుబాటి వెంకటేశ్వరరావు, సంతనూతలపాడు మాజీ ఎంఎల్‌ఎ విజయ్ కుమార్, స్థానిక ఎంఎల్‌ఎ ఏలూరి సాంబశివరావు, చీరాల ఎంఎల్‌ఎ కరణం బలరామ కృష్ణమూర్తి పాల్గొని విక్రమ్ నారాయణ కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు. నూతన సంవత్సరం సందర్భంగ రెండు రోజుల ముందే ఈ నూతన గృహ ప్రవేశ వేడుక సందర్భంగా ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచి దీప్తి విక్రమ్ నారాయణ, చిన్నగంజాం, ఇంకొల్లు టిడిపి అధ్యక్షులు పొద వీరయ్య, నాయుడు హనుమంతరావు, బత్తుల శ్రీనివాసరావు, చిన్నగంజాం మాజీ జడ్పిటిసి యార్లగడ్డ లక్ష్మి పాల్గొన్నారు.

➡️