కనుమరుగైన నది

Dec 3,2023 13:43 #Sneha

నదీ తీరంలో గూడు కట్టుకున్న

ఆఖరు పక్షి కూడా

నీటిని వెతుక్కుంటూ

వలస వెళ్లిపోయింది

 

చిన్న చిన్న పడవలలో

ఆవలి తీరం చేరే మనుషులు

ఈ రోజు కాలినడకన

దాటి వెళుతున్నారు

 

ఇసుక మైదానంలో

చిన్న పిల్లల ఐదు ఓవర్ల

క్రికెట్‌ ఆట అనునిత్యమూ

కొనసాగుతోంది

 

బారులు తీరిన చీమల

దండులా

తీరపు ఒడ్డున

ఇసుక మాఫియా లారీలు

భీతిని కలిగిస్తున్నాయి

 

నదీ తీరంలో నడుస్తున్నప్పుడు

పరిసరాలల్లో ప్రతిధ్వనిస్తున్న

నది యొక్క చావుకేకలు

చెవులను తూట్లు పొడుస్తున్నాయి

 

నది నడుమ తపస్సు

చేస్తున్న మునీశ్వరుడు

చూసే దిక్కు లేక

ఒంటరిగా మిగిలిపోయాడు

నదీ తీరపు రెల్లుగడ్డి

కార్చిన కన్నీళ్లు

అక్కడక్కడ గుంటలలో

నిలిచి ఉన్నాయి

 

నదిని హత్య చేసి

మనస్సాక్షిని అమ్మకానికి పెట్టి

మనం అందరం వాపోతున్నాం

ఇసుక ధరలు ఆకాశాన్ని

అంటుతున్నాయని..

తమిళం : కణ్ణన్‌అనువాదం: గౌరీ కృపానందన్‌ – 97910 69485

➡️