జగనన్నతోనే పేదల సంక్షేమం

Nov 25,2023 00:21

ప్రజాశక్తి – భట్టిప్రోలు
మండలంలోని సూర్యపల్లి గ్రామంలో రాష్ట్రానికి జగన్ ఎందుకు కావాలి అనే కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఎంపీపీ డివి లలిత కుమారి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి జరగాలంటే జగన్మోహన్‌రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావాలని వివరించారు. ఇప్పటివరకు ప్రభుత్వం అందజేసిన సంక్షేమ పథకాల బోర్డును ఆవిష్కరించారు. సచివాలయ కార్యాలయం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జెండాను ఎగరవేశారు. కార్యక్రమంలో జడ్పిటిసి తిరివిధుల ఉదయభాస్కరి, సర్పంచి మోర్ల విజయలక్ష్మి, వైసిపి మండల కన్వీనర్ మోర్ల శ్రీనివాసరావు, పిఎసిఎస్ చైర్‌పర్సన్‌ గోవర్ధనగిరి శేషాచలా శ్రీనివాసరావు (చిన్న బుజ్జి), కో ఆప్షన్ సభ్యులు షేక్ సలీం, ఎంపీటీసీ రావు రాజేశ్వరి, నాయకులు మల్లేశ్వరరావు, బాలాజీ, కార్యదర్శి అనురాధ పాల్గొన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా జెండా ఆవిష్కరణ
గ్రామ పంచాయతీల వద్ద జరిగే రాష్ట్రానికి జగన్ ఎందుకు కావాలని కార్యక్రమంలో పార్టీ జండాను పార్టీ కార్యాలయల వద్ద లేక ఇతర ప్రాంతాల్లో ఆవిష్కరించాల్సి ఉంది. కానీ అందుకు భిన్నంగా సూర్యపల్లి గ్రామంలో సాక్షాత్తు సచివాలయం వద్దనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దిమ్మెపై జెండా ఆవిష్కరించటం తీవ్ర విమర్శలకు కారణమైంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంక్షేమ పథకాల బోర్డులు మాత్రమే కార్యాలయం వద్ద ఆవిష్కరించాల్సి ఉంది. కానీ సచివాలయం వద్ద పార్టీ జెండా ఆవిష్కరించటం ప్రజలను విస్మయానికి గురిచేస్తుంది.

➡️