జపాన్‌ చేపట్టిన తొలి ప్రయివేటు రాకెట్‌ ప్రయోగం విఫలం

Mar 13,2024 12:02 #fails, #Japan, #Private rocket launch

జపాన్‌ : జపాన్‌ చేపట్టిన తొలి ప్రయివేటు రాకెట్‌ ప్రయోగం విఫలమైంది. ఈ ఘటన పశ్చిమ జపాన్‌లోని వకయమ ప్రిఫిక్చర్‌లోని లాంచ్‌ ప్యాడ్‌లో చోటు చేసుకొంది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం దాదాపు 60 అడుగుల పొడవైన కైరోస్‌ రాకెట్‌ చిన్న ప్రభుత్వ ప్రయోగ ఉప గ్రహాన్ని తీసుకొని నింగికి ఎగిరింది. కానీ, కొన్ని క్షణాల్లోనే ఇది పేలుడుకు గురై గాల్లోనే అగ్నిగోళంలా మారిపోయింది. దీని శకలాలు చూట్టూ ఉన్న పర్వత పాదాలపై పడ్డాయి. దీంతో తక్షణమే అక్కడ ఉన్న నీటి స్ప్రింక్లర్లు పనిచేయడం మొదలుపెట్టాయి. మరోవైపు పేలుడు ఫలితంగా లాంచ్‌ ప్యాడ్‌ ఏరియా మొత్తం నల్లటి పొగ కమ్మేసింది.

వాస్తవానికి ప్రయోగించిన 51 నిమిషాల్లోనే ఈ రాకెట్‌ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చాల్సి ఉంది.ఈ ప్రమాదంపై ఆ కంపెనీ స్పందిస్తూ ”కైరోస్‌ రాకెట్‌ లాంచింగ్‌ ప్రక్రియ సజావుగానే సాగింది. కానీ, ప్రయోగాన్ని మధ్యలోనే ఆపేసేందుకు చర్యలు తీసుకొన్నాం” అని స్పేస్‌ వన్‌ పేర్కొంది. ఆ నిర్ణయానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు.

➡️