చిలీ అడవిలో భారీ అగ్ని ప్రమాదం..10 మంది మృతి

Feb 3,2024 11:52 #chile, #Fatal fire accident, #Forest
chile forest

శాంటియాగో: దక్షిణ అమెరికాలోని సెంట్రల్‌ చిలీలోని అడవిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదం కారణంగా దాదాపు 10 మంది మరణించారు. ఈ ప్రమాదంలో దాదాపు 1,000కి పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ అగ్ని ప్రమాదంపై చిలీ హౌంమంత్రి కరోలినా తోహా మాట్లాడుతూ.. 14,000 హెక్టార్లలో మంటలు వ్యాపించాయన్నారు. రాజధాని శాంటియాగోకు దక్షిణంగా 310 మైళ్ల (500 కిమీ) దూరంలో ఉన్న బయోబియోలోని శాంటా జువానా పట్టణంలో అగ్నిమాపక సిబ్బందితో సహా 11 మంది మరణించారని తెలిపారు. అటవీలో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు సహాయక బృందాలు, హెలికాప్టర్లను రంగంలోకి దింపినట్లు తెలిపారు. వందల సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నాయని.. రాబోయే రోజుల్లో పరిస్థితి ప్రమాదకరంగా మారనుందని తోహా అన్నారు. కాగా అగ్నిప్రమాదానికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేశాయి.

➡️