అమెరికాలో క్యాపిటల్‌ భవనాలకు బాంబు బెదిరింపులు

Jan 4,2024 11:36 #bomb threats, #us state

వాషింగ్టన్‌ :   అమెరికాలో బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. పలు రాష్ట్రాల క్యాపిటల్‌ భవనాలకు ఈ బెదిరింపులు రావడంతో అప్రమత్తమైన పోలీసులు వాటిని ఖాళీ చేయించారు. జార్జియా, కనెక్టికట్‌, కెంటుకీ, మిషిగాన్‌, మిన్నెసోటా, మిసిసిపీ, మోంటానా, మైన్‌, హవాయి రాష్ట్రాల క్యాపిటల్‌ భవనాలకు బుధవారం ఉదయం (అమెరికా కాలమానం ప్రకారం) ఈ బాంబు బెదిరింపులు వచ్చాయి. గుర్తుతెలియని ఈ-మెయిల్‌ ఐడి నుండి ఒకేసారి అన్ని ఆఫీసులకు ఈ బెదిరింపులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో వెంటనే భవనాలను ఖాళీ చేయించి డాగ్‌ స్క్వాడ్‌లతో  తనిఖీలు చేపట్టారు. ఎక్కడా ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌బిఐ) తెలిపింది.

ఇరాన్‌లో బుధవారం  సైనిక ఉన్నతాధికారి సంస్మరణ కార్యక్రమంలో సంభవించిన జంట పేలుళ్ళలో వంద మందికిపైగా మరణించిన సంగతి తెలిసిందే.  మరో 141మంది గాయపడ్డారు.  మృతుల  సంఖ్య మరింత పెరిగే అవకాశముందన్నారు.

➡️