బ్లాక్‌ నజరీన్‌ గౌరవార్థం జనసంద్రమైన మనీలా !

Jan 10,2024 10:29 #philippines

మనీలా : ఫిలిప్పైన్స్‌ రాజధాని మనీలా నగరం లక్షలాదిమంది కేథలియన్లతో ఎరుపు, పసుపు రంగు సముద్రాన్ని తలపించింది. బ్లాక్‌ నజరీన్‌ గౌరవార్ధం ఈ ఏడాది జరిగిన బ్రహ్మాండమైన ప్రదర్శనకు 60 లక్షల మందికి పైగా కేథలిక్కులు హాజరయ్యారు. జీసెస్‌ క్రీస్ట్‌ నల్ల చెక్క విగ్రహానికి నివాళి ఘటించడం శతాబ్దాల నాటి నుంచి ఇక్కడ సాంప్రదాయంగా వస్తోంది. ఆ విగ్రహానికి రోగాలను నయం చేసే శక్తులు వున్నాయని స్థానికులు విశ్వసిస్తారు. గత మూడేళ్లుగా కోవిడ్‌ కారణంగా రద్దు చేస్తూ వస్తున్న ప్రదర్శన ఈ ఏడాది జరగడంతో ప్రజలు లక్షలాదిగా తరలివచ్చారు. తెల్లవారు జాముకే 8,30,000 మంది వచ్చారని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత 6 కిలోమీటర్ల పొడవునా సాగిన ప్రదర్శనలో 65 లక్షల మంది పాల్గొన్నారు. మెక్సికోలో రూపు దిద్దుకున్న ఈ విగ్రహాన్ని 17వ శతాబ్దం ఆరంభంలో ఫిలిప్పైన్స్‌కి తీసుకుచ్చారు. క్రీస్తు శిలువను మోస్తున్నట్లు ఈ విగ్రహం వుంటుంది. 15 గంటల పాటు కొనసాగిన ఈ ప్రదర్శన ఆద్యంతం శాంతియుతంగానే కొనసాగడం విశేషం.

➡️