Ecuador: కొండచరియలు విరిగి ఆరుగురు మృతి

Jun 17,2024 08:25 #Ecuador, #floods, #landslides

ఈక్వెడార్ : ఈక్వెడార్ లో కొండచరియలు విరిగిపడటంతో ఆరుగురు మరణించారు. భారీ వర్షాల కారణంగా పెద్ద పరిమాణంలో కొండచరియలు విరిగిపడటంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ విపత్తులో 19 మంది గాయపడగా,  30 మంది గల్లంతు అయ్యారు. ఈ ఘటనను ఈక్వెడార్ అధికారులు ధృవీకరించారు. ఈక్వెడార్‌లోని రిస్క్ మేనేజ్‌మెంట్ సెక్రటేరియట్ తన నివేదికలో కొండచరియలు విరిగిపడడాన్ని చాలా తీవ్రతతో వివరించింది. ఈక్వెడార్ పబ్లిక్ వర్క్స్ మంత్రి రాబర్టో లూక్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్లో తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. అన్ని కుటుంబాలకు తన సానుభూతి తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. అల్పపీడన ప్రభావంతో ఆదివారం ఏర్పడిన తుఫానుతో  దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాలను ముంచెత్తింది. ఈక్వెడార్ అంతటా వరదనీటి ప్రవాహంతో హైవేలు, వంతెనలను తీవ్రంగా దెబ్బతిన్నాయి.

 

➡️