విషాదం.. పెంపుడు కుక్క కరవడంతో తండ్రి కొడుకు మృతి..

Jun 26,2024 12:36 #2 death, #dog attack

ప్రజాశక్తి-భీమిలి : పెంపుడు కుక్క కరవడంతో తండ్రి కొడుకు మృతి చెందిన విషాద ఘటన భీమిలిలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై కుటుంబ సభ్యుల తెలిపిన వివరాల ప్రకారం.. వారం రోజుల క్రితం నర్సింగరావు(59), కొడుకు భార్గవ్(27)ను పెంపుడు కుక్క కరిచింది. భార్గవ్ను ముక్కు మీద, నర్సింగరావును కాలిపై కరిచింది. అయితే.. వారిని కరిచిన రెండు రోజుల్లో కుక్క చనిపోయింది. వెంటనే అప్రమత్తమై.. రేబిస్ ఇంజక్షన్స్ వేయించుకున్నారు. అయినప్పటికీ.. బ్రెయిన్ తో పాటు ఇతర భాగాలకు రేబిస్ సోకడంతో చికిత్స పొందుతుండగా తండ్రి కొడుకు మృతి చెందారు. కుటుంబంలో ఇద్దరు మృతి చెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి.

➡️