కరాచీలో ఎన్నికల ఘర్షణ

electoral violence in karachi

25 మంది పిటిఐ కార్యకర్తల అరెస్టు

కరాచీ: పాకిస్తాన్‌ పార్లమెంటు ఎన్నికలకు మరో పది రోజులు మాత్రమే వ్యవధి ఉండడంతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. జైలులో నిర్బంధించిన ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన పాకిస్తానీ తెహ్రిక్‌ ఇస్తామిక్‌ పార్టీ (పిటిఐ) ఎన్నికల ర్యాలీని అడ్డుకోవడానికి పోలీసులు యత్నించడంతో ఘర్షణ చెలరేగింది. ఈ సందర్భంగా 25 మంది పిటిఐ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. రెడ్‌ జోన్‌లో ఎన్నికల ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు చెబుతుండగా, ఎన్నికల ప్రచారం చేసుకునే రాజ్యాంగ హక్కును పోలీసులు అడ్డుకుంటున్నారని పిటిఐ కార్యకర్తలు పేర్కొన్నారు. మిలిటరీ ఈ ఎన్నికలను తొత్తడం చేసేందుకే పిటిఐ నేతను జైలులో నిర్బంధించిందని, ఇప్పుడు ప్రచారాన్ని కూడా జరుపుకోనివ్వడం లేదని వారు ఆరోపిస్తున్నారు. పీటీఐ నేత హమ్మద్‌ అజార్‌ తండ్రిని ఆదివారం లాహౌర్‌లో అరెస్టు చేశారని వారు తెలిపారు. మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌తో మిలిటరీ కుమ్మక్కయిందని, అందుకే ఆయనను ఏదో ఒక విధంగా ప్రధానిని చేసేందుకు అది కుట్రపన్నుతోందని పిటిఐ పార్టీ ఆరోపించింది. జైలులో ఉన్న పార్టీ వ్యవస్థాపకుడు ఇమ్రాన్‌ ఖాన్‌ పిలుపు మేరకే వారు ఈ ఎన్నికల ర్యాలీని నిర్వహించడానికి పూనుకున్నారు.

➡️