గంజాయి వినియోగం బిల్లుకు జర్మన్‌ పార్లమెంట్‌ ఆమోదం!

Feb 24,2024 13:33 #Bills, #ganjay, #jarmany

జర్మనీ : గంజాయి నియంత్రిత సాగు, పరిమిత వ్యక్తిగత వినియోగానికి జర్మనీ గ్రీన్‌సిగల్‌ ఇచ్చింది. కాగా ప్రతిపక్ష పార్టీలు, వైద్య సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పటికీ గంజాయి నియంత్రిత సాగు, పరిమిత వ్యక్తిగత వినియోగానికి జర్మనీ ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం నియంత్రిత విధానంలో గంజాయి సాగు చేసే వారి దగ్గర నుంచి రోజుకు 25 గ్రాముల వ్యక్తిగత వినియోగం ప్రాతిపదికన గంజాయి కొనుగోలు చేసే అవకాశం ఈ బిల్లు కల్పించింది. ఇంతే కాకుండా ప్రతి ఇంట్లో మూడు గంజాయి మొక్కలను కూడా పెంచుకునే అవకాశం ఉంది. ఈ చట్టాన్ని పార్లమెంట్‌లో ప్రవేశ పెడుతూ జర్మనీ ఆరోగ్యశాఖ మంత్రి కార్ల్‌ లాటర్బాక్‌ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం జర్మన్‌ దేశంలో ఉన్న పరిస్థితిలో ఈ చట్టానికి ఆమోదం తెలపడం మనందరికీ ఎంతైనా అవసరం ఉందన్నారు. దేశంలో పెద్ద సంఖ్యలో యువత బ్లాక్‌ మార్కెట్‌లో కొని గంజాయిని సేవిస్తోంది అనే విషయాన్ని ఆయన పేర్కొన్నారు.

➡️