సంజీవని నిధికి హెచ్‌పిసిఎల్‌ ఉద్యోగుల విరాళం

ప్రజాశక్తి – కలెక్టరేట్‌ (విశాఖపట్నం) :పేదలకు, అనారోగ్య బాధితులకు సాయం చేయాలనే దృక్పథంతో నెలకొల్పిన సంజీవని నిధి (డిస్ట్రిక్ట్‌ రిలీఫ్‌ ఫండ్‌)కి హెచ్‌పిసిఎల్‌ విశాఖ రిఫైనరీ ఉద్యోగులు తమ వంతు సాయంగా రూ.6,45,000ను విరాళంగా అందించారు. సదరు మొత్తాన్ని సంజీవని నిధి బ్యాంకు ఖాతాలో జమ చేశారు. ఈ మేరకు విశాఖ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ మల్లికార్జునను హెచ్‌పిసిఎల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వి రతన్‌రాజ్‌ కలిసి సంబంధిత పత్రాలను గురువారం అందజేశారు. విశాఖ రిఫైనరీలో పని చేస్తున్న ఉద్యోగులందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి సంజీవని నిధికి తమ వంతుగా ఆర్థిక సాయం అందించడం గొప్ప విషయమని కలెక్టర్‌ అభినందించారు. హెచ్‌పిసిఎల్‌ ఉద్యోగుల చూపిన చొరవను, దాతృత్వాన్ని మిగిలిన అందరిలో తప్పకుండా స్ఫూర్తిని నింపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

➡️