జర్మనీ ప్రాంతీయ ఎన్నికల్లో మితవాద ఎఎఫ్‌డికి ఎదురు దెబ్బ

Jan 30,2024 11:20 #afd party, #Germany, #international

బెర్లిన్‌ : తూర్పు జర్మనీలోని తురింజియాలో ఆదివారం జరిగిన ఎన్నికల్లో మితవాద పార్టీ అయిన ఎఎఫ్‌డి (ఆల్టర్‌నేటివ్‌ ఫర్‌ జర్మనీ) కి గట్టి ఎదురు దెబ్బ తగిలింది.కన్జర్వేటివ్‌ పార్టీ సిడియుకి చెందిన అభ్యర్ధి హెర్గాట్‌ చేతిలో ఎఎఫ్‌డి అభ్యర్ధి చిత్తుగా ఓడిపోయారు. ఇటీవల పతాక శీర్షికలకెక్కిన ‘మూక్ముమడి తరలింపు’ వార్తలతో దేశవ్యాప్తంగా మితవాద పార్టీ ఎఎఫ్‌డిపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు నవంబరులో జరిగిన ఒక సమావేశంలో ఎఎఫ్‌డి రాజకీయ నేతలు సమావేశమై దేశం నుంచి విదేశీ సంతతికి చెందిన జర్మన్‌ పౌరులను సామూహికంగా గెంటివేయాలని పిలుపు ఇచ్చారన్న వార్తలపై జర్మనీ అంతటా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. లీప్జిగ్‌లో లక్షలాదిమందితో భారీ నిరసన ర్యాలీ జరిగింది.. మితవాద తీవ్రవాదం ప్రజాస్వామ్యానికే ప్రమాదకరంగా పరిణమించింది. నెలకొనాలని కోరుతూ 10లక్షల మందికి పైగా ప్రజలు ఈ ర్యాలీల్లో పాల్గొన్నారు. ఆ నేపథ్యంలో తాజా ఎన్నికలు జరిగాయి. రెండు వారాల క్రితం జరిగిన సాధారణ ఎన్నికల్లో ఎఎఫ్‌డి అభ్యర్ధికి 45.7శాతం ఓట్లు రాగా, ప్రత్యర్ధి హెర్గాట్‌కు 33.3 శాతమే ఓట్లు వచ్చాయి. కానీ ఆదివారం జరిగిన ప్రాంతీయ ఎన్నిక ఓటింగ్‌లో హెర్గాట్‌కు 52.4శాతం ఓట్లు రాగా, ఎఎఫ్‌డి అభ్యర్ధి కేవలం 47.6శాతం ఓట్లే వచ్చాయి. 2014 నుండి జిల్లా స్థాయి పార్లమెంటేరియన్‌గా వున్న హెర్గాట్‌ ఫిబ్రవరి 9న జిల్లా అడ్మినిస్ట్రేటర్‌గా బాధ్యతలు చేపడతారు. తురింజియాలో ఎఎఫ్‌డికి బలమైన మద్దతు వుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి తోడ్పాటు తగ్గుతోందని భావిస్తున్నారు.

➡️