Hajj : 98 మంది భారతీయులు మృతి : కేంద్రం

న్యూఢిల్లీ :   ఈ ఏడాది హజ్‌ యాత్రలో 98 మంది భారతీయులు మరణించినట్లు శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వారంతా సహజ కారణాలతోనే మరణించారని విదేశాంగ శాఖ తెలిపింది. ఈ ఏడాది ఇప్పటివరకు హజ్‌ యాత్ర కోసం 1,75,000 మంది భారతీయులు సౌదీ అరేబియా వెళ్లారని, అక్కడి వారి కోసం చేయవలసినదంతా చేస్తామని  ఓ ప్రకటనలో  వెల్లడించింది.

హజ్‌ యాత్రలో సుమారు 1,081 మంది మరణించినట్లు పది దేశాలు నివేదించాయి. ఈ గణాంకాలు అధికారిక ప్రకటనలు లేదా ఆయా దేశాల దౌత్యవేత్తలు సమాచారమిచ్చినట్లు దౌత్యవేత్త పేర్కొన్నారు.

➡️