మలేషియాకు వీసా అక్కర్లేదు !

Nov 27,2023 10:07 #Malaysia, #Visa
no visa to malaysia

డిసెంబర్‌ 1 నుంచి అమల్లోకి
కౌలాలంపూర్‌ : భారత్‌, చైనా నుంచి వచ్చే పర్యాటకులకు వీసా లేకుండానే తమ దేశంలోని పర్యాటక ప్రదేశాల సందర్శనకు అనుమతిస్తున్నట్లు మలేషియా ప్రధానమంత్రి అన్వర్‌ ఇబ్రహీం తెలిపారు. జస్టిస్‌ పార్టీ వార్షిక సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్టుబడుల్ని, పర్యాటకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. మలేషియా ఆర్థికంగా ముందుకెళ్లాలంటే పర్యాటక రంగ అభివద్ధి ముఖ్యం ఆయన చెప్పారు. ఇందులో భాగంగానే చైనా, భారత్‌ పౌరులకు వీసా లేకుండానే తమ దేశంలో పర్యటించేందుకు అనుమతులిస్తామని తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్‌ 1 నుంచి చైనా, భారతీయ పౌరులు వీసా లేకుండా మలేషియాలో పర్యటించే వీలుంటుందన్నారు. తమ దేశంలోకి ప్రవేశించినప్పటి నుంచి 30 రోజుల పాటు వీసా లేకుండా ఉండొచ్చని ఆయన తెలిపారు. కాగా భారతీయులకు వీసా అవసరం లేకుండానే పర్యటించే సౌలభ్యాన్ని ఇటీవల థాయిలాండ్‌, శ్రీలంక ప్రభుత్వాలు కూడా కల్పించిన సంగతి విదితమే.

➡️