కెనడాలో హత్యకు గురైన పంజాబ్‌ యువకుడు

Jun 10,2024 11:44 #Canada, #Punjab Man, #Shot Dead

ఒట్టావా :   భారత సంతతికి చెందిన 28 ఏళ్ల యువకుడు ఈ నెల 7న కెనడాలో హత్యకు గురయ్యారు. పథకం ప్రకారం అతనిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

పంజాబ్‌లోని లుథియానాకు చెందిన యువరాజ్‌ గోయల్‌ 2019లో స్టూడెంట్‌ వీసాపై కెనడా వెళ్లారు. ఇటీవల అతనికి శాశ్వత నివాస  (పిఆర్‌) హోదా లభించింది. గోయల్‌పై ఎలాంటి క్రిమినల్‌ రికార్డు లేదని, హత్యకు గల కారణాలపై విచారణ జరుగుతోందని రాయల్‌ కెనడియన్‌ పోలీసులు తెలిపారు.

వివరాల ప్రకారం.. సర్రేలోని 164 వీధిలో 900-బ్లాక్‌లో కాల్పులు జరిగినట్లు గత శుక్రవారం ఉదయం 8.46 గంటలకు ఫోన్‌ వచ్చింది. ఘటనాస్థలానికి చేరుకునే సరికి యువరాజ్‌ గోయల్‌ మరణించారు. సర్రే ప్రాంతానికి చెందిన మన్వీర్‌ బస్రామ్‌, సాహిబ్‌ బస్రా, హర్‌కిరత్‌ జుట్టీ, ఒంటారియోకు చెందిన మరో నిందితుడు ఫ్రాంకోయిస్‌లను అదుపులోకి తీసుకున్నట్లు సుర్రే పోలీసులు తెలిపారు. వారిపై ఫస్ట్‌-డిగ్రీ హత్యకేసు నమోదు చేశామని అన్నారు.

➡️