దక్షిణ పెరూలో భారీ భూకంపం ..

Jun 28,2024 23:59 #Earthquake, #Pacific Ocean, #Peru

లిమా : దక్షిణ పెరూలో భారీ భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 12.30 నిమిషాలకు భూకంపం వచ్చిందని, దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 7.2గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. భూకంప కేంద్రం కారవెలి ప్రావిన్స్‌లో ఆంటిక్విపా జిల్లాకు పశ్చిమాన 8 కి.మీ దూరంలో ఫసిపిక్‌ సముద్రంలో భూకంప కేంద్రం ఉంది. చిలీ, బలీవియా సరిహద్దుకి సమీపాన రాజధాని లిమాకు 380 మైళ్ల దూరంలో ఉంది. 28 కి.మీ లోతులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. రాజధాని లిమాతో పాటు ఐకా, అయాకుచో ప్రాంతాల్లో భూమి కంపించినట్లు స్థానిక మీడియా తెలిపింది. ప్రధాన రహదారిపై రాళ్లు పడటంతో జిల్లాకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయినట్లు అయాకుచో ప్రాంతంలోని శాంకోస్‌ జిల్లా మేయర్‌ స్థానిక మీడియాకు తెలిపారు. ఈ దేశం ఫసిపిక్‌ రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌లో ఉండటంతో పెరులో తరచుగా భూకంపాలు వస్తుంటాయి.

➡️