మార్చిలో రష్యా అధ్యక్ష ఎన్నికలు

Dec 8,2023 10:32 #elections, #russia, #Vladimir Putin

 

మాస్కో: వచ్చే ఏడాది మార్చిలో రష్యా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల తేదీని అక్కడి చట్టసభ సభ్యులు నిర్ణయించారు. 2024 మార్చి 17న అధ్యక్ష ఎన్నికలు జరపాలనే నిర్ణయానికి ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించి రష్యా కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం సమావేశం కానుంది. రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్‌ పుతిన్‌ రెండు దశాబ్దాలకుపైగా కొనసాగుతున్నారు. స్టాలిన్‌ కన్నా ఎక్కువకాలం పాటు పదవిలో కొనసాగారు. పుతిన్‌ ప్రస్తుత ఆరేళ్ల పదవీకాలం 2024లో ముగుస్తుంది. ఎన్నికల ప్రక్రియకు చట్టసభ ఆమోదం తెలిపినప్పటికీ.. 2024 ఎన్నికల్లో పుతిన్‌ పోటీ చేయడంపై ఇంకా తన నిర్ణయాన్ని ప్రకటించలేదు. అయితే మరికొన్ని రోజుల్లోనే దీనిపై ప్రకటన చేసి భారీ స్థాయిలో ప్రచారం చేస్తారని సమాచారం.

➡️