వాతావరణాన్ని కాపాడండి

Mar 13,2024 08:41 #Environment, #Protest, #Sweden

స్వీడిష్‌ పార్లమెంట్‌ వద్ద కార్యకర్తల ఆందోళన
స్టాకహేోం : ముదురుతున్న వాతావరణ సంక్షోభం నేపథ్యంలో చేపట్టాల్సిన మార్పులకు సంబంధించి సత్వరమే చర్యలు చేపట్టాలని కోరుతూ స్వీడిష్‌ వాతావరణ కార్యకర్త గ్రెటా థన్‌బెర్గ్‌్‌తో సహా పలువురు కార్యకర్తలు స్వీడిష్‌ పార్లమెంట్‌ వద్ద సోమవారం బైఠాయించారు. ప్రత్యేకంగా ఒక సంస్థకు చెందిన వారిగా కన్నా యువతే ప్రధానంగా ఈ ఆందోళనలో పాల్గొన్నారు. స్టాకహేోంలోని ప్రభుత్వ భవనాల సముదాయం ప్రధాన ప్రవేశమార్గం వెలుపల వారు కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. రాజకీయ నేతలు లోపలకు వెళ్ళి తమ విధులు నిర్వర్తించనీయకుండా అడ్డుకున్నారు. వేడెక్కుతున్న భూగోళం, మానవాళికి ముప్పుగా పరిణమిస్తున్న వాతావరణ మార్పులు వేటినీ కూడా స్వీడిష్‌ ప్రభుత్వం అత్యవసర పరిస్థితిగా చూడడం లేదని 21ఏళ్ల వాతావరణ కార్యకర్త గ్రెటా థన్‌బెర్గ్‌ విమర్శించారు. తాము చాలా చేస్తున్నామని, సరైన దిశలోనే ముందుకు సాగుతున్నామని పైకి కనిపించేలా చేస్తూ లోపల మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఇప్పటికీ ఒప్పందంలో పేర్కొన్న కుదిరిన పర్యావరణ లక్ష్యాల సాధనకు ఏ విధంగా ముందుకు సాగాలన్నదానిపై స్వీడిష్‌ ప్రభుత్వం వద్ద నిర్దిష్ట ప్రణాళికలేవీ లేవని ఆమె విమర్శించారు.

➡️