ఇజ్రాయిల్‌, లెబనాన్‌ల మధ్య తీవ్రమైన దాడులు

Feb 27,2024 17:02 #Attacks, #Israel, #Lebanon

బీరుట్‌ :    ఇజ్రాయిల్‌, లెబనాన్‌ల మధ్య దాడులు తీవ్రమయ్యాయి. ఇజ్రాయిల్‌ ప్రయోగించిన డ్రోన్‌ను లెబనాన్‌ తిరుగుబాటు దారుల గ్రూపు హిజ్బుల్లా కూల్చివేసింది. దక్షిణ లెబనాన్‌లోని ఇక్లిమ్‌ అల్‌ -తుఫా నుండి ప్రయోగించిన ఉపరితలం నుండి గగనతలం క్షిపణితో కూల్చివేసినట్లు హిజ్బుల్లా ఓ ప్రకటనలో పేర్కొంది. ఇజ్రాయిల్‌ దురాక్రమణను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొంది.

అయితే ఈ ప్రకటనను ఇజ్రాయిల్‌ అధికారులు తిరస్కరించారు. డ్రోన్‌ను కూల్చివేయడం అంటే అది ‘అద్భుత చర్య’ అవుతుందని అన్నారు. ప్రతిచర్యగా ఇజ్రాయిల్‌ బీకా వ్యాలీ, మజదీల్‌ నగరంపై బాంబులతో దాడికి దిగింది. ఈ దాడిలో సుమారు నలుగురు మరణించారు. అగ్నిప్రమాదంతో పాటు కొండచరియలు విరిగిపడటంతో ఆస్తినష్టం జరిగింది. టైర్‌ నగరంపై హిజ్బుల్లా బాంబుదాడితో హసన్‌ హుస్సేన్‌ సలామీని హత్య చేసినట్లు ఇజ్రాయిల్‌ ఆరోపణలతో లెబనాన్‌పై ఇజ్రాయిల్‌ దాడులను వేగవంతం చేసింది.

➡️