26 నుండి అబూదాబిలో డబ్ల్యుటిఓ సమావేశాలు

దుబాయ్  :  ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఓ) 13వ మంత్రిత్వ స్థాయి సమావేశం అబూదాబిలో ఈ నెల 26 నుండి 29వరకు జరుగుతుంది. అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించిన నియమ నిబంధనలపై ఈ సమావేశంలో చర్చ జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా మంత్రులు, సీనియర్‌ అధికారులు, ప్రైవేటు రంగ రుణదాతలు, ఎన్‌జిఓలు, పౌర సంఘాల ప్రతినిధులు సమావేశాలకు హాజరవుతారు. అందరినీ కలుపుకుని పోయే వాణిజ్య వ్యవస్థను మరింత ముందుకు తీసుకెళ్ళాలన్నదే ఈ సమావేశాల ప్రధాన ఉద్దేశ్యంగా వుంది. వాణిజ్య రంగంలో ఎదురవుతున్న సవాళ్ళను పరిష్కరించేందుకు, వాణిజ్య నిబంధనలను సవరించేందుకు, అంతర్జాతీయ వాణిజ్య విధానానికి ఎజెండా నిర్దేశించేందుకు మంత్రిత్వ స్థాయి సమావేశాలు సభ్య దేశాలకు కీలకమైన వేదికలుగా వ్యవహరిస్తాయి. వాణిజ్య విధానాలను మరింత మెరుగుపరుచుకునే క్రమంలో ఎన్‌జిఓలతో, ప్రైవేటు రంగంతో, పౌర సమాజంతో సహకారాన్ని, భాగస్వామ్యాలను మరింత పెంచుకునేందుకు, విస్తరించేందుకు ఈ సమావేశం ఒక అవకాశాన్ని కల్పిస్తుంది.

➡️