హద్దు మీరినా ఇజ్రాయిల్‌కే మద్దతు

Mar 11,2024 10:55 #Israel, #israel hamas war, #Joe Biden

 అమెరికా అధ్యక్షుడు బైడెన్‌
విల్మింగ్టన్‌ : యుద్ధోన్మాదంతో రగిలిపోతూ గాజాలో మారణకాండ సాగిస్తున్న ఇజ్రాయిల్‌కు అమెరికా మరోమారు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. గాజాపై దాడుల విషయంలో ఇజ్రాయిల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహుకు తాము అన్ని విధాల మద్దతుగా ఉంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మరోసారి నిస్సిగ్గుగా ప్రకటించారు. గాజా విషయంలో నెతన్యాహు తీసుకుంటున్న చర్యలు ఇజ్రాయిల్‌కే నష్టం చేస్తాయని, గాజాపై దాడుల విషయంలో నిబంధనలకు ఇజ్రాయిల్‌ కట్టుబడి లేదని చెబుతూనే… ఎంత హద్దు మీరినా అంతిమంగా తమ మద్దతు ఇజ్రాయిల్‌కే ఉంటుందని చెప్పారు. ఇజ్రాయిల్‌ దేశ రక్షణ, అక్కడి పౌరుల భద్రత చాలా కీలకమని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఆ దేశానికి కొన్ని రకాల ఆయుధాలను అందించటం, ఐరన్‌ డోమ్‌ వ్యవస్థకు మద్దతివ్వటం వంటి విషయాల్లో రాజీ ఉండదని స్పష్టం చేశారు. తన అభిప్రాయాన్ని నేరుగా ఇజ్రాయిల్‌కు వెళ్లి అక్కడి పార్లమెంటుకే తెలియజేయాలనుకుంటున్నానని బైడెన్‌ వెల్లడించారు.

➡️