శ్రీకృష్ణ జన్మభూమి వివాదం : సుప్రీం కీలక తీర్పు

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని మథురలో శ్రీకృష్ణ జన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. ఈ ఆలయం పక్కనే ఉన్న షాహీ ఈద్గాలో శాస్త్రీయ సర్వేకు అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సర్వోన్నత న్యాయస్థానం నిలిపివేసింది. హైకోర్టు ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్లపై తమ స్పందన తెలియజేయాలని హిందూ సంఘాలను సుప్రీం కోర్టు ఆదేశించింది. అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన ఉత్వర్వులపై స్టే విధించింది. ఆర్కిలయాలజీ నిపుణులతో సర్వేను జరపాలన్న పిటీషన్లపై సుప్రీంకోర్టు ఈ తీర్పు చెప్పింది. దీంతో శ్రీకృష్ణ జన్మభూమి వివాదంపై ఆర్కియాలజీ నిపుణులు సర్వే నిర్వహించనున్నారు. మధుర షాషి ఈద్గా దర్గాలో సర్వేలు నిర్వహించి నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించనున్నారు.

➡️