కూలిన భవనం – ఇద్దరు కార్మికుల మృతి

Mar 21,2024 09:39 #collapsed building, #Deaths, #Delhi

ఢిల్లీ : ఈశాన్య ఢిల్లీలోని వెల్‌కమ్ ప్రాంతంలో భవనం కూలిపోవడంతో జీన్స్ ఫ్యాక్టరీలో ఇద్దరు కార్మికులు మరణించగా, మరొకరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. జీన్స్ ఫ్యాక్టరీకి చెందిన ముగ్గురు కార్మికులు రెండంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో పనిచేస్తున్నారు. ” మొదటి అంతస్తు ఖాళీగా ఉండగా, గ్రౌండ్ ఫ్లోర్ జీన్స్ కటింగ్ కు చేస్తుండగా రెండంతస్తుల  పాత నిర్మాణ భవనం కూలిపోయిందని మధ్యాహ్నం 2:16 గంటలకు కాల్ వచ్చింది” అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఈశాన్య) జాయ్ టిర్కీ తెలిపారు.  “శిథిలాల కింద చిక్కుకున్న ముగ్గురు కార్మికులను బయటకు తీసి జిటిబి ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారిలో ఇద్దరు చనిపోయినట్లు ప్రకటించారు” అని మరొక అధికారి తెలిపారు. మృతులను అర్షద్ (30), తౌహిద్ (20)గా గుర్తించారు. గాయపడిన రెహాన్ (22) జిటిబి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. భవనం యజమాని షాహిద్‌గా గుర్తించామని.. అతడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

➡️