అవుటర్‌ మణిపూర్‌ రీపోలింగ్‌లో 81.16 శాతం పోలింగ్‌

May 1,2024 00:33 ##elections #voter, #Manipur

ఇంఫాల్‌ : అవుటర్‌ మణిపూర్‌ లోక్‌సభ స్థానంలో మంగళవారం రీపోలింగ్‌ నిర్వహించిన ఆరు పోలింగ్‌ కేంద్రాల్లో 81.16 శాతం పోలింగ్‌ నమోదైందని ఎన్నికల కమిషన్‌ అధికారులు తెలిపారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 4 గంటల వరకూ కొనసాగింది. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా పోలింగ్‌ జరిగినట్లు అధికారులు చెప్పారు. ఏప్రిల్‌ 26న రెండోదశలో భాగంగా ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఈ ఆరు పోలింగ్‌ స్టేషన్లలో గుర్తు తెలియని వ్యక్తులు ఇవిఎంలు, వివి ప్యాట్లను నాశనం చేయడంతో రీపోలింగ్‌ అనివార్యమైంది. ఏప్రిల్‌ 26న జరిగిన అవుటర్‌ మణిపూర్‌ లోకసభ నియోజవర్గంలో 76.06 శాతం పోలింగ్‌ నమోదైంది.

➡️