అమెరికాలో రోడ్డు ప్రమాదం.. భారతీయ యువతి మృతి

Mar 24,2024 11:27 #America, #road accident, #women death

అమెరికాలోని పెన్సిల్వేనియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతదేశానికి చెందిన యువతి  మృతి చెందింది. ఈ విషయాన్ని యూఎస్‌లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ‘ఈ నెల 21న పెన్సిల్వేనియాలో జరిగిన కారు ప్రమాదంలో భారతీయ యువతి  ప్రొఫెషనల్ అర్షియా జోషి(21) మరణించింది. వారి కుటుంబ సభ్యులను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం’ అని ఎక్స్‌లో పేర్కొంది. జోషి మృత దేహాన్ని ఇండియాకు తీసుకొచ్చేందుకు అన్ని విధాలా సహాయం చేస్తామని, ఆమె కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉన్నామని తెలిపింది.  జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఆర్షియా జోషీ ఇటీవలే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఓ సంస్థలో పనిచేస్తున్నట్టు తెలుస్తోంది.

➡️