Liquor Policy Case : కేజ్రివాల్‌కు బెయిల్‌

న్యూఢిల్లీ : ఇడి కేసుల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు బెయిలు లభించింది. ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ కుంభకోణంలో విచారించేందుకు ఎనిమిదిసార్లు సమన్లు జారీ చేసినా హాజరు కావడం లేదంటూ కేజ్రివాల్‌పై ఇడి ఫిర్యాదు చేయడం, న్యాయస్థానం ఆదేశాల నేపథ్యంలో శనివారం ఆయన ఢిల్లీలోని రౌజ్‌ అవెన్యూ కోర్టుకు హాజరయ్యారు. ఆయనపై పెట్టిన కేసులు బెయిల్‌ పొందడానికి అవకాశం ఉన్న సెక్షన్లని న్యాయమూర్తి తెలిపారు. రూ.15వేల పూచీకత్తు, లక్ష రూపాయల ష్యూరిటీపై ఇడి చేసిన రెండు ఫిర్యాదుల్లోనూ కేజ్రివాల్‌కు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. పూచీకత్తును సమర్పించి కోర్టు అనుమతితో కేజ్రివాల్‌ వెళ్లిపోయారు. సిఆర్‌పిసి సెక్షన్‌ 207 కింద పత్రాలను తనకు అందజేయాలంటూ కేజ్రివాల్‌ పెట్టుకున్న దరఖాస్తును ఏప్రిల్‌ 1న కోర్టు విచారించనుంది.

➡️