Bengal Governor: రాజ్‌భవన్ ఖాళీ చేయాల్సిందే ..

కోల్‌కతా : బిజెపి నేతను అడ్డుకున్న పోలీస్‌ అధికారులను తక్షణమే రాజ్‌భవన్‌ను ఖాళీ చేయాల్సిందిగా రాష్ట్ర గవర్నర్‌ సి.వి. ఆనంద్‌ ఆదేశించారు.  ఈ మేరకు  ఉత్తర్వులు జారీ అయినట్లు  సోమవారం  ఓ అధికారి తెలిపారు.  ఇటీవల బిజెపి నేత సువేందు అధికారిని రాజ్‌భవన్‌లోకి వెళ్లకుండా కోల్‌కతా పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే.

దీంతో ఆగ్రహించిన గవర్నర్‌ పోలీసులను రాజ్‌భవన్‌లో విధుల నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆఫీసర్‌ ఇన్‌చార్జ్‌ సహా పోలీస్‌ అధికారులందరినీ వెంటనే ఖాళీ చేయాల్సిందిగా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పోలీస్‌ అవుట్‌ పోస్ట్‌ను కూడా రాజ్‌భవన్‌ నార్త్‌గేట్‌కు సమీపం నుండి పబ్లిక్‌ ప్లాట్‌ఫామ్‌ (జన్‌ మంచ్‌) వైపు మార్చాలని గవర్నర్‌ భావిస్తున్నట్లు ఆ అధికారి తెలిపారు.

➡️