ప్రజ్వల్‌ లైంగిక వేధింపుల కేసులో భవాని రేవణ్ణకు బెయిల్‌

Jun 18,2024 23:10 #bail, #Bhavani Revanna

బెంగుళూరు : ప్రజ్వల్‌ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసులో అతని తల్లి భవాని రేవణ్ణకు కర్ణాటక హైకోర్టు మంగళవారం మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. ప్రజ్వల్‌ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసు బాధితుల్లో ఒకరిని కిడ్నాప్‌ చేశారన్న ఆరోపణలతో భవాని రేవణ్ణపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. భవానికి బెయిల్‌ మంజారు చేసిన కోర్టు విచారణ కోసం ఆమెను హాసన్‌, మైసూర్‌ జిల్లాలకు తీసుకుని వెళ్లడానికి సిట్‌కు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు జస్టిస్‌ కృష్ణ ఎస్‌ దీక్షిత్‌ ఉత్తర్వులు జారీ చేశారు. వేడుకలు, ఊరేగింపు వంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని భవాని రేవణ్ణను కోర్టు ఆదేశించింది.

➡️