ఆర్థికశాఖ శ్వేతపత్రం సిద్ధం

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి :రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల్లో భాగంగా ఆర్థికశాఖకు సంబంధించిన శ్వేతపత్రం సిద్ధమైనట్లు తెలిసింది. పది సంవత్సరాల ఆర్థిక పరిస్థితిని ఈ శ్వేతపత్రంలో అధికారులు పొందుపరిచినట్లు సమాచారం. వివిధ రంగాలకు సంబంధించిన శ్వేతపత్రాలను విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఆర్థికశాఖ సిద్ధం చేసిన నివేదికలో 2014వ సంవత్సరం నుండి నురచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వ హయారలోని పరిస్థితులు, 2019 నురచి 2024 వరకు వైసిపి హయారలో పరిస్థితులను వివరించినట్లు తెలిసిందే., వైసిపి హయాంలో ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారినట్లు తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రంగా ఆరోపణలు చేస్తున్న నేపద్యంలో ఈ శ్వేతపత్రానికి ప్రాధాన్యత నెలకొంది. గడిచిన ఐదేళ్ల కాలంలో వచ్చిన ఆదాయం, చేసిన అప్పుల వివరాలను, ఆఫ్‌ బడ్జెట్‌ రుణాలుగా వివిధ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి భారీగా తీసుకున్న రుణాలు, వాటని ఖర్చు చేసిన తీరును కూడా కూడా బహిరంగ పంచాలని సిఎం కార్యాలయం నుండి ఆర్థికశాఖకు ఆదేశాలు అందాయి. దీంతో ఆ వివరాలను కూడా శ్వేతపత్రంలో పొందుపరచనున్నారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన వివరాలను మూడు, నాలుగు నివేదికలుగా అధికారులు రూపొందించినట్లు తెలిసింది. వాటిలోని కీలక అంశాలతో శ్వేతపత్రాన్ని రూపొందించినట్లు సమాచారం.

➡️