బీజేపీకి బిగ్‌ షాక్‌.. ఎంపీ బ్రిజేందర్‌ రాజీనామా

Mar 10,2024 13:00 #BJP, #Haryana, #MP Brijender, #resignation

హర్యానా  : లోక్‌సభ ఎన్నికల ముందర బీజేపీకి బిగ్‌ షాక్‌ తగిలింది. ఆ పార్టీ ఎంపీ బ్రిజేందర్‌ (51) ఆదివారం బీజేపీకి రాజీనామా ప్రకటించారు. రాజకీయ కారణాల వల్లే బలవంతంగా తాను పార్టీని వీడాల్సి వస్తోందని ఎక్స్‌ అకౌంట్‌ ద్వారా ప్రకటించారు. హర్యానా హిసార్‌ పార్లమెంటరీ స్థానం నుంచి బ్రిజేందర్‌ సింగ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. త్వరలో ఆయన కాంగ్రెస్‌లో చేరతారని సమాచారం.

➡️