2025 నుంచి ఏడాదికి రెండుసార్లు బోర్డు ఎగ్జామ్స్‌

సిబిఎస్‌ఇని కోరిన కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీ : 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఏడాదికి రెండు సార్లు బోర్డు ఎగ్జామ్స్‌ నిర్వహించడానికి విధివిధానాలు రూపొందించాలని సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెంకడరీ ఎడ్యుకేషన్‌ (సిబిఎస్‌ఇ)ను కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ కోరింది. సెమిస్టర్‌ విధానాన్ని ప్రవేశపెట్టే యోచనను విరమించకున్నట్లు విద్యా శాఖ తెలిపింది. ఏడాది రెండు సార్లు బోర్డు ఎగ్జామ్స్‌ నిర్వహించడానికి వచ్చే నెలలో పాఠశాల ప్రిన్సిపాల్స్‌తో కేంద్ర మంత్రిత్వ శాఖ, సిబిఎస్‌ఇ సమావేశాలు జరపనున్నాయి. ఇంటర్మీడియేట్‌ షెడ్యూల్‌పై ప్రభావం చూపకుండా మరో సెట్‌ బోర్డు ఎగ్జామ్స్‌ నిర్వహించే విధంగా అకడమిక్‌ క్యాలెండర్‌ను రూపొందించడానికి సిబిఎస్‌ఇ ప్రస్తుతం విధివిధానాలను రూపొందించే పనిలో ఉంది. గత సంవత్సరం కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించిన నూతన కరికులం ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌సిఎఫ్‌) ప్రకారం విద్యార్థులు మంచి పనితీరు కనబర్చడానికి, ఉత్తమ స్కోర్‌ను నిలబెట్టుకునే అవకాశాలు పొందడానికి తగిన సమయం, ఎంపిక ఉండేలా బోర్డు పరీక్షలు ఏడాదికి రెండుస్లారు నిర్వహించనున్నారు.

➡️