CBSE results: బాలికలదే పైచేయి

May 14,2024 08:00 #10 Results, #10th Board, #cbse

సిబిఎస్‌ఇ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల ఫలితాలు విడుదల

న్యూఢిల్లీ : సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సిబిఎస్‌ఇ) 10, 12వ తరగతుల్లో బాలికలు పైచేయి సాధించారు. సోమవారం ఫలితాలు విడుదల చేసిన సిబిఎస్‌ఇ టాపర్ల జాబితాను విడుదల చేయలేదు. టాప్‌ 0.1 శాతం మంది విద్యార్థులకు మెరిట్‌ జాబితాను విడుదల చేయనున్నట్లు బోర్డు తెలిపింది. పదవ తరగతి పరీక్షల్లో 94.75 శాతం ఉత్తీర్ణత సాధించారు. గతేడాది కంటే 0.48 శాతం ఎక్కువ ఫలితాలు వచ్చాయి. బాలుర కంటే బాలికలు 2.04 శాతం పాయింట్లతో పైచేయి సాధించారు. 12వ తరగతి బోర్డు పరీక్షల్లో 87.98 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికల ఉత్తీర్ణత శాతం 91.52. కాగా బాలుర ఉత్తీర్ణత శాతం 85.12 శాతంగా ఉంది. బాలుర కంటే 6.40 శాతం అధికంగా బాలికలు ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది కంటే 0.65 శాతం పెరుగుదల నమోదైంది.

12వ తరగతిలో తిరువనంతపురం టాప్‌
12వ తరగతి పరీక్షల్లో తిరువనంతపురం 99.91 శాతం ఉత్తీర్ణతతో అగ్రస్థానంలో ఉంది. ఆ తరువాత స్థానాల్లో విజయవాడ (99.04), చెన్నై (98.47), బెంగళూరు (96.95) ఉన్నాయి. 77.94 శాతంతో గువహటి అత్యల్పంగా నిలిచింది.
సిబిఎస్‌ఇ 10వ, 12వ ఫలితాలు రెండింటినీ అధికారిక వెబ్‌సైట్‌లు షbరవతీవరబశ్ర్‌ీర.అఱష.ఱఅ, తీవరబశ్ర్‌ీర.షbరవ.అఱష.ఱఅ, షbరవ.స్త్రశీఙ.ఱఅ, షbరవ.అఱష.ఱఅ వెబ్‌ సైట్లలో చెక్‌ చేసుకోవచ్చని తెలిపింది. డిజిలాకర్‌ నుండి కూడా ఫలితాలను తనిఖీ చేయవచ్చు.
ఈ ఏడాది సిబిఎస్‌ఇ పదవ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15, మార్చి 13 మధ్య, 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్‌ 2వ తేదీల మధ్య జరిగాయి. సుమారు 39 లక్షల మంది విద్యార్థులు బోర్డు పరీక్షలకు హాజరయ్యారు.

➡️