ఫ్యాక్ట్‌ చెక్‌ యూనిట్‌ నోటిఫికేషన్‌పై స్టే విధించిన సుప్రీంకోర్టు

Mar 21,2024 15:54 #Fact-Check Unit, #Supreme Court

న్యూఢిల్లీ :    ఫ్యాక్ట్‌ చెక్‌ యూనిట్‌ నోటిఫికేషన్‌పై సుప్రీంకోర్టు గురువారం స్టే విధించింది. నకిలీ వార్తల సమస్యను పరిష్కరించేందుకు ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ఆధ్వర్యంలో (పిఐబి) ఆధ్వర్యంలో ఫ్యాక్ట్‌ చెక్‌ యూనిట్‌ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు బాంబే హైకోర్టు తీర్పుని పక్కన పెట్టింది. భావప్రకటనా స్వేచ్ఛకు సంబంధించిన అంశమని సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌, జస్టిస్‌ జె.బి. పార్థివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది.  అయితే  ఈ కేసు అర్హత గురించి ప్రస్తావించలేదు.

కిలీ, తప్పుడు సమాచారాన్ని గుర్తించేందుకుగాను ఫ్యాక్ట్‌చెక్‌ యూనిట్‌ను తీసుకువస్తామని కేంద్ర ప్రభుత్వం గతే డాది ఏప్రిల్‌లో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రూల్స్‌-2021కు సవరణలు చేసింది. అయితే, ఈ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని, భావప్రకటనా స్వేచ్ఛకు విరుద్ధమని దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.

ఫ్యాక్ట్‌ చెక్‌ యూనిట్‌పై కేంద్రం నోటిఫికేషన్‌ను అడ్డుకోవాలని కోరుతూ.. స్టాండ్‌ అప్‌ కమిడియన్‌ కునాల్‌ కమ్రా, ఎడిటర్స్‌ గిల్డ్ ఆఫ్  ఇండియా బాంబే హైకోర్టుని ఆశ్రయించారు. ఫ్యాక్ట్‌ చెక్‌ యూనిట్‌ ఏర్పాటుపై మధ్యంతర స్టే ఇచ్చేందుకు బాంబే హైకోర్టు నిరాకరించింది. దీంతో ఈ తీర్పును సవాల్‌ చేస్తూ పిటీషనర్లు సుప్రీంకోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు.న

 

➡️