లండన్‌ చేరుకున్న సీఎం జగన్‌.. నినాదాలు చేసిన అభిమానులు

May 18,2024 16:15 #cm jagan, #reached London

లండన్‌: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్‌ ముగియడంతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లారు. శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ (గన్నవరం ఎయిర్‌పోర్ట్‌) నుంచి బయల్దేరి వెళ్లిన సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రి బయలుదేరిన సీఎం జగన్‌..శనివారం మధ్యాహ్నం లండన్‌ చేరుకున్నారు. జగన్‌ లండన్‌ విమానాశ్రయంలో దిగగానే.. అక్కడ కూడా జై జగన్‌ అంటూ నినాదాలు మారుమోగాయి. ఎయిర్‌పోర్ట్‌లో ఫ్లైట్‌ దిగి కారు ఎక్కుతుండగా అభిమానులు జై జగన్‌ అంటూ నినాదాలు చేశారు. చిరునవ్వుతో జగన్‌ ఎయిర్‌పోర్టులో ఉల్లాసంగా కనిపించారు. ఈ నెల 31వ తేదీ తిరిగి సీఎం వైఎస్‌ జగన్‌ బెజవాడ చేరుకోనున్నారు.

➡️