‘ మోడీ పై పోటీ చేస్తున్నా ‘ : హాస్యనటుడు శ్యామ్‌ రంగీలా కీలక ప్రకటన

వారణాసి : ‘ మోడీ పై పోటీ చేస్తున్నా ‘ అంటూ … హాస్యనటుడు శ్యామ్‌ రంగీలా కీలక ప్రకటన చేశారు. దేశ వ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో … ఇప్పటికే రెండు విడతల పోలింగ్‌ ముగిసింది. ఇక మూడో విడత పోలింగ్‌ మే 7 న జరగనుంది. అనంతరం మే 13, 20, 25, జూన్‌ 1 న పోలింగ్‌ జరగనుంది. ఇక వారణాసి పోలింగ్‌ చివరి విడతలో జరగనుంది. అంటే జూన్‌ 1న ఓటింగ్‌ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్‌ 4న విడుదల కానున్నాయి.

మోడీపై పోటీకి రెడీ : హాస్యనటుడు శ్యామ్‌ రంగీలా
వారణాసికి వస్తున్నా … ఈ ఎన్నికల్లో ప్రధాని మోడీపై పోటీ చేయడానికి సిద్ధమయ్యా అంటూ… హాస్యనటుడు శ్యామ్‌ రంగీలా ఎక్స్‌ ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు. వీడియోను విడుదల చేశారు. ఇప్పటికే ప్రధాని మోడి వారణాసి నుండి రెండుసార్లు విజయాన్ని సాధించారు. మూడోసారి కూడా గెలుపొందడానికి వారణాసి బరిలో దిగారు. అయితే ప్రధాని మోడీని అనుకరిస్తూ శ్యామ్‌ రంగీలా పేరు సంపాదించారు. అయితే బుధవారం వారణాసి నుంచి పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. మిగతా విషయాలను త్వరలో వీడియో ద్వారా తెలియజేస్తానని అన్నారు.

గతం వేరు.. ఇప్పుడు వేరు : శ్యామ్‌ రంగీలా
2014లో ప్రధాని మోడీకి మద్దతుగా ప్రచారం చేసినట్లు శ్యామ్‌ రంగీలా తెలిపారు. అనేక వీడియోలు కూడా చేసినట్లు చెప్పారు. రాహుల్‌, కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా వీడియోలు చేసినట్లు తెలిపారు. అయితే … గతం పరిస్థితి వేరు.. ఇప్పటి పరిస్థితి వేరుగా ఉందన్నారు. 10 ఏళ్లలో పరిస్థితుల్నీ మారిపోయాయనీ… అందుకే లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నుంచి ప్రధాని మోడీపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

➡️