ఇసి తీరుపై ఇఎఎస్‌ శర్మ ఆందోళన

May 13,2024 07:12 #Election Commission, #orders

న్యూఢిల్లీ : భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 324 ప్రకారం ఎన్నికల సంఘం తన ఆదేశాన్ని తానే ప్రాథమికంగా విస్మరించిందని భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఇఎఎస్‌ శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. నిష్క్రియాత్మకత మన ప్రజాస్వామ్యం, సామాజిక సామరస్యానికి కోలుకోలేని నష్టాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు ముగ్గురు ఎలక్షన్‌ కమిషనర్లు (ఇసిల)కు ఆయన లేఖ రాశారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీతో సహా అధికార బిజెపి స్టార్‌ క్యాంపెయినర్ల ద్వేషపూరిత ప్రసంగాల మధ్య, ఎన్నికల సంఘం పోషించిన పాత్ర ఏమీ లేదని వివరించారు. ప్రధానంగా ముస్లిం సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని ద్వేషపూరిత ప్రసంగాలు చేస్తూ.. కోడ్‌ ఉల్లంఘనలకు పాల్పడినవారిపై పదేపదే ఫిర్యాదులు అందినా.. ప్రజాస్వామ్య పరిరక్షక స్థానంలో ఉన్న ఇసి అనేక సందర్భాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు.

➡️