గుండెపోటుతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మృతి

Feb 25,2024 17:03 #Congress legislator, #Karnataka

  బెంగళూరు :   కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీలో విషాదం చోటుచేసుకుంది. కర్ణాటకలోని సురపుర నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆ పార్టీ ఎమ్మెల్యే రాజా వెంకటప్ప నాయక్‌ (67) మరణించారు. ఆదివారం ఉదయం గుండెపోటుతో బెంగళూరులోని మణిపాల్‌ ఆస్పత్రిలో మృతిచెందారు.

నెల రోజుల క్రితమే రాజా వెంకటప్ప నాయక్‌ గిడ్డంగుల కార్పొరేషన్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. నాయక్‌ 1994,1999, 2013లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994లో మొదటి సారిగా జనతాదళ్‌కు చెందిన శివన్న మంగీహాల్‌పపై పోటీ చేసి విజయం సాధించారు.  కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు అత్యంత  సన్నిహతుడు.

కాగా, రాజా  వెంకటప్ప నాయక్  మృతి పట్ల ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే సంతాపం వ్యక్తం చేశారు.

➡️