రాజ్యాంగాన్ని మార్చుకోవచ్చు

  • టివి రాముడు, మీరట్‌ బిజెపి అభ్యర్థి అరుణ్‌ గోవిల్‌

న్యూఢిల్లీ : రాజ్యాంగాన్ని మార్చుకోవచ్చునని బిజెపి మీరట్‌ అభ్యర్థి, టివిలో రాముడిగా నటించిన అరుణ్‌ గోవిల్‌ వ్యాఖ్యానించారు. బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్పు చేస్తుందన్న ప్రతిపక్షాల విమర్శలపై మీడియా ప్రశ్నలకు సమాధానంగా ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ”కాలానుగుణంగా రాజ్యాంగంలో కొన్ని సవరణలు జరిగాయి. మార్పు అనేది అభివృద్ధికి సంకేతం. ఇది ప్రతికూలాంశం కాదు. నాటికి, నేటికీ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. అయితే, రాజ్యాంగంలో మార్పులు జరగాలంటే మాత్రం అది ఓ వ్యక్తి అభిప్రాయంతో సాధ్యం కాదు. ప్రతి ఒక్కరి ఏకాభిప్రాయంతో దాన్ని మార్చుకోవచ్చు” అని వ్యాఖ్యానించారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. గతంలో కొందరి వ్యాఖ్యలను గుర్తు చేస్తూ రాజ్యాంగాన్ని మార్పు చేసేందుకు బిజెపి యోచిస్తోందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ విమర్శించారు.

➡️