కవితకు బిగ్‌ షాక్‌.. సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతి

ఢిల్లీ : ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఎమ్మెల్సీ కవితను కస్టడీకి ఇవ్వాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషిన్‌పై రౌస్‌ అవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది. కవిత అరెస్ట్‌ అక్రమంటూ ఆమె తరుఫు లాయర్లు వాదించగా.. లిక్కర్‌ స్కామ్‌ కేసులో కవితనే ప్రధాన సూత్రధారి అని సీబీఐ ఆరోపించింది.ఇరు వర్గాల వాదనలు విన్న రౌస్‌ అవెన్యూ కోర్టు స్పెషల్‌ జడ్జి కావేరి భవేజా సీబీఐ వాదనలతో ఏకీభవించారు. ఈ మేరకు కవితను మూడు రోజుల పాటు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ఉత్వర్వులు ఇచ్చారు. దీంతో ఈ నెల 15వ తేదీ వరకు ఎమ్మెల్సీ కవితను కస్టడీలోకి తీసుకుని సీబీఐ ప్రశ్నించనుంది. మరోవైపు ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో సీబీఐ తనను అరెస్ట్‌ చేయడాన్ని సవాల్‌ చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను రౌస్‌ అవెన్యూ కోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే.

➡️