రేషన్‌ షాపులు పునఃప్రారంభించాలని పుదుచ్చేరిలో సిపిఎం ఆందోళన

Feb 20,2024 11:02 #cpm protest, #ration shops

పుదుచ్చేరి :    రేషన్‌ షాపులను పునఃప్రారంభించాలని డిమాండ్‌ చేస్తూ పుదుచ్చేరిలో రాత్రి, పగలు మొత్తం రోజంతా సిపిఎం ఆందోళన నిర్వహించింది. ఇక్కడి కొక్కు పార్క్‌ వద్ద ఉన్న పౌర సరఫరాల కార్యాలయం ఎదురుగా జరిగిన నిరసనలో సిపిఎం కార్యదర్శి ఆర్‌ రాజంగం ప్రసంగించారు. రేషన్‌ షాపులను పునఃప్రారంభించాలని రెండున్నర ఏళ్లుగా తమ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పారు. ‘ప్రజలంతా నగదుకు బదులుగా బియ్యం కోరుకుంటున్నారు. కాబట్టి ఒక పగలు, ఒక రాత్రి ఆందోళన ద్వారా ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని పార్టీ నిర్ణయించింది’ అని తెలిపారు. 2021 ఎన్నికల ప్రచారంలో రేషన్‌ షాపులను పునఃప్రారంభిస్తామని అఖిల భారత ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్‌ రంగసామి ప్రజలకు హామీ ఇచ్చినా, ఆయన నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు.

➡️