కీలక తీర్పుల్లో ప్రధానికి అనుకూలంగా సుప్రీంకోర్టు

cpm leader ma baby on Supreme Court in favor of Prime Minister in key judgments

సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు ఎంఎ బేబి ఆరోపణ

న్యూఢిల్లీ : కీలక తీర్పుల్లో సుప్రీంకోర్టు ప్రధాని మోడీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నదని సిపిఐ (ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు ఎం.ఎ బేబి ఆరోపించారు. మోడీకి ఎలాంటి హానీ కలగకుండా కోర్టు తీర్పులిస్తున్నదని చెప్పారు. కేరళలోని కన్నూర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్‌ 370 రద్దుపై సుప్రీంకోర్టు తీర్పు దేశంలోని న్యాయవ్యవస్థ చరిత్రను అవమానపర్చటమేనని ఆయన అన్నారు. దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నదని చెప్పారు. తనపై కేసు నమోదైనా తాను బయపడనని, ఎందుకంటే సుప్రీంకోర్టు ముందైనా ఈ విషయాలను చెప్పగలనని ఆయన అన్నారు.

➡️