ఢిల్లీ మేయర్‌ షెల్లీ ఒబెరాయ్ ఫేస్‌బుక్‌ పేజ్‌ హ్యాక్‌

Dec 16,2023 13:18

న్యూఢిల్లీ : ఢిల్లీ మేయర్‌ షెల్లీ ఒబెరాయ్ తన ఫేస్‌బుక్‌ పేజ్‌ హ్యాక్‌ అయిందని ఆమె శుక్రవారం ప్రకటించారు. గత కొన్నిరోజులుగా సోషల్‌ మీడియాలో తన ఫేస్‌బుక్‌ పేజీ యాక్సెస్‌లో లేదని ఆమె తెలిపింది. వీలైనంత త్వరగా రికవరీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మేయర్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘కొన్ని రోజుల నుంచి నా ఫేస్‌బుక్‌ పేజీ హ్యాక్‌ అయింది. మేము వీలైనంత త్వరగా దాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నాము. నా పేజీ ద్వారా ఏదైనా అసాధారణ కార్యాకాలాపాలకు సంబంధించిన సమాచారం పాస్‌ అయి ఉంటుందనే కారణంతోనే పేజీ హ్యాక్‌ అయిందని తెలుస్తుంది. దీని గురించి మీరు తెలుసుకోండి.’ అని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు.

➡️