ఘోర ప్రమాదం – 8 మంది మృతి

Feb 21,2024 09:18 #8, #Fatal accident, #people died

పట్నా (బీహార్‌) : బీహార్‌లో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లఖిసరాయ్ పట్టణం సమీపంలోని ఝూల్నా గ్రామం వద్ద ఈరోజు తెల్లవారుజామున ఆటోరిక్షాను లారీ ఢీకొట్టడంతో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారిని పట్నాలోని సర్దార్‌ హాస్పిటల్‌కు తరలించామన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోరిక్షాలో 14 మంది ఉన్నట్లు తెలిపారు. అతివేగం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️